రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ సేవలు అభినందనీయం

12-11-2026 | 09:32pm

ఆదిలాబాద్,(విజయక్రాంతి): రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ రాథోడ్ జై సింగ్(RIMS Hospital Director Rathod Jai Singh) అందిస్తున్న వైద్య సేవలు(Medical services) అభినందనీయమని పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు కొనియాడారు. గురువారం జైసింగ్ రాథోడ్ ను శాలువాతో సత్కరించి, అభినందించారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ చేసిన స్పందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారని పలువురు పేర్కొన్నారు. 

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా, అత్యవసర సమయాల్లో సైతం అందుబాటులో ఉంటూ వైద్య సేవలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి సేవాభావం కలిగిన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు భరత్ చౌహన్, జిల్లా అధ్యక్షుడు ఆడే సురేష్, రాథోడ్ భీమ్రావు, రాథోడ్ నారాయణ,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు