వాగు ఎండింది నీటి కరువు తప్పేట్టు లేదు

28-10-2026 | 03:51pm

సోనాల మండల వాసుల ఆవేదన

బోథ్. అక్టోబర్ 28 ( విజయక్రాంతి): సోనాల మండల కేంద్రం(Sonala Mandal Headquarters) సమీపంలో ఉన్న వాగు నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో మండల కేంద్రంలో నీటి కరువు వచ్చేట్టు ఉందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. స్థానిక తహసిల్దార్ గత వారం రోజుల క్రితం వాగుచుట్టూ ఉన్న మోటార్లను తొలగించాలని ఆదేశించారు.

అయితే కొంతమంది రైతులు తమ పంటలు ఎండిపోతాయని వారం రోజులు ఓపిక పట్టాలని తాసిల్దారుకు విన్నవించారు. అయినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాగుకు బిగించిన మోటార్లను తొలగించాలని తాసిల్దార్ మల్లేశం రైతులకు సూచించారు. 

ఇంకా తొలగించలేదు...

సోనాల వాగు చుట్టూ ఉన్న మోటాలను కొంతమంది రైతులు తొలగించగా పోవడంతోపాటు నీటిని పంటలకు వినియోగించడంతో వాగు ప్రవాహం నిలిచిపోయిందని మండల కేంద్రం నకు చెందినవారు వాపోతున్నారు.

పంటల కోసం నీటిని వినియోగించడం వల్ల వాగు ల్లో నీరు లేకుండా పోయిందని భవిష్యత్తులో పశువులకు తీవ్రమైన నీటి ఎద్దడి ఎదురవుతుందని తక్షణమే మోటార్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. 

నీటి ఎద్దడి తప్పదేమో...సోనాల వాసి రామ్ రెడ్డి

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల వాగు నీటి ప్రవాహం అంతంత మాత్రమే ఉందని మండల కేంద్రానికి చెందిన రైతు రామ్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో వాగు ప్రవాహం నిలిచిపోగా ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే వాగు ఎండిపోయిందని పేర్కొన్నారు.

వాగు చుట్టూ ఉన్న మోటార్లను తొలగించకపోతే మండల కేంద్రంలో నీటి కరువు తప్పేట్టు లేదని ఆందోళన వ్యక్తపరిచారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైతులు వాగు చుట్టూ ఉన్న మోటార్లను తొలగించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు