కొండపల్లిలో కార్డెన్ సర్చ్ గుడుంబా స్వాధీనం
28-10-2026 | 05:50pm
పెంచికలపేట అక్టోబర్ 28(విజయక్రాంతి ): మండలములోని కొండపల్లి గ్రామములో (Kondapalli villages)బుధవారం ఉదయం పోలీసుల ఆధ్వర్యములో కార్డెన్ సెర్చ్(Carden Search) నిర్వహించారు. ఎస్సై అనిల్ కుమార్(SI Anil Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.