నూతన డిఐఈఓ ను కలిసిన తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్

13-11-2026 | 10:01pm

బోథ్. నవంబర్ 13 (విజయ క్రాంతి): అదిలాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారిగా(Intermediate Education Officer, Adilabad District) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ కైసర్ పాశాను శుక్రవారం తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్(Telangana Gazetted Lecturers Association) ఆధ్వర్యంలో కలిసి సన్మానించారు. అదిలాబాద్ జిల్లా ను విద్యాభివృద్ధిలో(Educational Development) అగ్రస్థానంలో నిలిపేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

అందరి సహకారంతో జిల్లాను విద్యాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేతకు తన వంతు సహకారం ఉంటుందని డిఐఈఓ లెక్చరర్స్ తో పేర్కొనడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పన్నాల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నాకర్, ఉపాధ్యక్షుడు శ్రీహరి, గణేష్ లు ఉన్నారు.

మరిన్ని వార్తలు