క్రీడా పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

13-11-2026 | 09:55pm

నాగర్‌ కర్నూల్ నవంబర్ 13 (విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో(District level sports competition) తెలకపల్లి మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వనపర్తి జిల్లా చిట్యాలలో మూడు రోజులగా జరుగుతున్న   పోటీల్లో కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకుని రన్నరప్‌గా నిలిచారు. రెండు క్రీడా విభాగాల్లోనూ ఉత్తమ ప్రతిభ చాటి పాఠశాలకు పేరు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్,  పీఈటీ మల్లేష్ విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు