రోడ్డు ప్రమాదంలో మృతి

13-11-2026 | 10:02pm

బిజినేపల్లి, నవంబర్ 13 : మండలంలోని పాలెం గ్రామానికి(Palem Village) మూడు వారాల క్రితం పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం  వలస వచ్చిన శ్రీశైలం (29) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం అదే గ్రామంలో రోడ్డు ప్రమాదానికి(Road Accident) గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగరుకర్నూలు జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం తన బార్య, ఇద్దరు పిల్లలతో పాలెం గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చి కూరగాయలు, జొన్న రొట్టెలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

శ్రీశైలం శుక్రవారం సాయంత్రం నాగరుకర్నూలు నుండి పాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తునాడు. పాలెం పోస్ట్ ఆఫీస్ సమీపంలో ప్రధాన రహదారిపై ప్రమాదశావత్తు బొలెరో వాహనం ఢీకొనడంతో శ్రీశైలం తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. పాలెం సర్పంచ్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది మృతదేహాని నాగరుకర్నూలు ప్రభుత్వాసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు