మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం

13-11-2026 | 10:07pm

మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్

మేడిపల్లి, నవంబర్ 13 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్(Boduppal Circle) పరిధిలోని టెలిఫోన్ కాలనీలో మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ శుక్రవారం  కాలనీవాసులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి(Development of CC roads and drainage) కృషి చేస్తామని, కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, డివిజన్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు