ఇంకుడు గుంత నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు
భిక్కనూర్, నవంబర్ 13 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం గురజాకుంట గ్రామంలో జలసిరి కార్యక్రమంలో(Jalasiri program) భాగంగా చేపట్టిన ఇంకుడు గుంత నిర్మాణ పనులను డీఎల్పీఓ శ్రీనివాస్, ఎంపీడీవో సవితారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.
వర్షపు నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని తెలిపారు. అవసరానికి మించి నీటిని వినియోగించకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ రాజ్ కిరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఉపసర్పంచ్ సంతోష్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి బాలకిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.