భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్
ముకరంపుర, నవంబర్ 13(విజయ క్రాంతి): హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరుగుతున్న భారత్ సమ్మిట్ లో(India Summit) కరీంనగర్ సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబుతో(Industrial Minister Sridhar Babu) పాటు ఇతర మంత్రులు ముఖ్య నాయకులు ఒక్కో సబ్జెక్టు పై ప్రసంగించారని ప్రపంచంలో వస్తున్న అనేక విప్లవాత్మక మార్పుల దృష్ట్యా భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు సాగాలనే పలు అంశాలపై నిపుణులచే కూలంకషంగా సమావేశంలో చర్చలు జరుపుతున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు.ఈ సమ్మిట్ లో వివిధ దేశాల డెలిగేట్లు భారత్ లోని వివిధ రాష్ట్రాల డెలిగేట్లు పాల్గొన్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.