ఏడుపాయల్లో కార్తీక శోభ

13-11-2026 | 08:58pm

వనదుర్గమ్మ సన్నిధిలో ఆకాశ దీప కాంతులు 

పాపన్నపేట,నవంబర్13: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా(Vanadurga Mata Temple).. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత(Edupayala vanadurgaamata)సన్నిధిలో కార్తీక శోభ సంతరించుకుంది. శుక్రవారం ఆలయ అర్చకులు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారి రూపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

రాత్రి సమయంలో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్తీక దీపోత్సవం, ఆకాశ దీపోత్సవ వేడుకలను నిర్వహించారు. అమ్మవారి ముందున్న ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తంభానికి ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించి పైకి ఎగురవేశారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ ఆకాశదీపాన్ని వెలిగించనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు