గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు
13-11-2026 | 10:05pm
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, సీరోలు మండలాల్లోని వివిధ గ్రామాల్లో గుడుంబా స్థావరాలు పై ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(Excise and Enforcement Officers), సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న గుడుంబాను పట్టుకున్నారు. పలువురిపై కేసు నమోదు చేశారు. గుడుంబా తయారీకి సిద్ధం చేసిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగరాజు, భారతి, సిబ్బంది పాల్గొన్నారు.