దుండిగాల నారాయణ మృతి అత్యంత బాధాకరం
హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్,నవంబర్ 13: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దుండిగాల నారాయణ(Dundigala Narayana) మృతి అత్యంత బాధాకరమని మాజీ ఎమ్మెల్యే,బిజెపి పార్టీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి(Sanam pudi Saidireddy) అన్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దుండిగాల నారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, బాధిత కుటుంబాన్ని ఓదార్చి కొంతమేర ఆర్థిక సహాయాన్ని(Financial assistance) అందించి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమం(Telangana Movement) ఎగిసి పడిన నుండి తెలంగాణ రాష్ట్రం సాధించేంతవరకు నారాయణ చేసిన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయక మన్నారు. దుండిగాల నారాయణ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కేఎల్ఎన్ రావు,బిజెపి జిల్లా నాయకులు సోమగాని ప్రదీప్ గౌడ్,విజయ్, తదితరులు, పాల్గొన్నారు.