ఫీజు బకాయిలపై హుజూర్‌నగర్‌లో టీఎన్ఎస్ఎఫ్ నిరసన

13-11-2026 | 08:56pm

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుంటే ప్రజాభవన్ ముట్టడిస్తాం 

విద్యార్థి సంఘాల హెచ్చరిక 

కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): విద్యార్థులకు(Students') చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డిలో(Kamareddy) టిఎన్ఎస్ఎఫ్(TNSF) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement) విద్యార్థులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ప్రజా భవన్ ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.

ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక కళాశాల యజమాన్యాలు సర్టిఫికెట్ లు ఇవ్వక ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను ఆందోళన గురి చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలోనే ప్రజా భవన్ ముట్టడిస్తామని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు బాలు, సంతోష్, రజని, నర్సింలు, అన్వేష్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు