యాసంగిలో ఆరుతడికి రెండు విడతలే పోచారం నీరు
నాగిరెడ్డిపేట్,నవంబర్ 13 (విజయక్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టు(Pocharam Project) క్రింద ఉన్న ఏ,,జోన్ ఆయకట్టు రైతులకు(Farmers') యాసంగి పంటలకు నీటి విడుదలపై(Water release) మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రైతులతో కలిసి తైబంద్ సమావేశం నిర్వహించారు.ఈ యొక్క సమావేశంలో ఏఈఈ వెంకటేశ్వర్లు రైతులతో కలిసి చర్చించి ఎన్ని విడతలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పోచారం ప్రాజెక్టులో(Pocharam Project)1457.87 అడుగుల నీటి సామర్థ్యం ఉంది.మండల అగ్రికల్చర్ ఏవో సాయికిరణ్ ఆరుతడి పంటల గురించి వివరించారు.
కూరగాయల సాగు(Vegetable cultivation) గురించి చర్చించారు.ఏ విధంగా తక్కువ నీటితో పంటలు పండించాలో సభలో చర్చించారు.ఏ,, జోన్ ఆయకట్టు రైతులు వరి పంట తప్ప ఆరుతడి పంటలు వేసుకోవాలని అంగీకరించారు.నీటిని పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించారు.ఆరుతడి పంటలు కాకుండా వరి పంట వేసుకుంటే వేసుకున్న వరి పంట ఎండిపోతే రైతులే బాధ్యత వహించాలని తీర్మానించారు.
అయితే ఈ యొక్క తైబందు సమావేశంలో ఆరుతాడి పంటల నిమిత్తం కోసం రెండు విడుతల నీటిని ఇవ్వడం జరుగుతుందని తీర్మానించారు.ఈ కార్యక్రమంలో ఏఈఈ వెంకటేశ్వర్లు,ఎమ్మార్వో వెంకటరెడ్డి,ఏవో సాయికిరణ్,మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ కలాలి సురేందర్ గౌడ్,రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.