నీటి పొదుపు, ఆరోగ్య రక్షణపై విద్యార్థినులకు అవగాహన
నల్లబెల్లి, నవంబర్ 21 ( విజయక్రాంతి): విద్యార్థినుల్లో(female students) పర్యావరణ స్పృహ, ఆరోగ్య పరిరక్షణపై(Environmental awareness, health preservation) అవగాహన పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ సత్య శారద(District Collector Satya Sharada) ప్రవేశపెట్టిన 'స్ఫూర్తి' కార్యక్రమంలో భాగంగా శనివారం మూడుచెక్కలపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం బి. రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, మండల వ్యవసాయ అధికారి రజిత బన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో మారుతున్న వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో తలెత్తే నీటి కొరతపై ఆమె విద్యార్థినులకు వివరించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నల్లబెల్లి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఆచార్య మాట్లాడుతూ, మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా ఎంతగానో దోహదపడుతుందని, వైద్యుల సూచన మేరకు అర్హులంతా టీకా వేయించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ జె. వీరమ్మ, ఉపాధ్యాయులు పద్మ, బి. బాలు తదితరులు పాల్గొన్నారు.