కాఫెడ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం

21-11-2026 | 06:12pm

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 21, విజయక్రాంతి: కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ(CAFED Voluntary Organization) ఆధ్వర్యంలో వెంకటాపురం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాన్ని కాఫెడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల  విద్యాలయం(Kasturba Gandhi Balika Vidyalaya)(కేజీబీవీ), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( జడ్పీహెచ్ఎస్(ZPHS)), నాయకులగూడెం ప్రాథమిక పాఠశాల, పాత్రపురం పాఠశాల, మంగవాయి పాఠశాల, అంకన్నగూడెం ఎంపీపీఎస్, రామచంద్రపురం ఎంపీయూపీఎస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్(Little Flower School), బోదాపురం ఎంపీపీఎస్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు  ఇతర కళారూపాల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శిరీష, వెంకటాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రామచంద్రపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశ్రీ, పాత్రపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి, అంకన్నగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత, కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ బ్రదర్ కె. లూర్దు రాజు పాల్గొన్నారు. నాయకులగూడెం ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు కాఫెడ్ వెంకటాపురం మండల కోఆర్డినేటర్ జి. హనుమంతు, వాజేడు మండల కోఆర్డినేటర్ జి. కామేష్, యానిమేటర్లు  కాఫెడ్ సిబ్బంది పాల్గొని.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో అవసరమని, అన్నారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులందరికీ కాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు కాఫెడ్ సంస్థ నిరంతరం కృషి చేస్తోందని సంస్థ డైరెక్టర్ బ్రదర్ కె. లూర్దు రాజు తెలిపారు.

మరిన్ని వార్తలు