ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి
28-11-2026 | 04:15pm
బోథ్, నవంబర్ 28 (విజయక్రాంతి): గ్రామాల్లో ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) కింద కల్పిస్తున్న పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రత్నాకర్ రావు సూచించారు.
శనివారం మండలంలోని వజ్జర్ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న పనులను (Development Works) ఆయన పరిశీలించారు. ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వి.బి.జి. రాంజీ పథకం (VBG Ramji Scheme) కింద పలు పనులను మంజూరు చేసిందని తెలిపారు. వీలైనంత ఎక్కువ మంది కూలీలు పనుల్లో పాల్గొని లబ్ధి పొందాలని సూచించారు. ఆయన వెంట ఏపీవోతో పాటు సిబ్బంది ఉన్నారు.