బాలిక అదృశ్యంపై కేసు నమోదు
ములకలపల్లి,నవంబర్ 13 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలిక అదృశ్యంపై(Girl Missing) కేసు నమోదు చేసినట్లు ములకలపల్లి ఎస్ఐ మధు ప్రసాద్(Mulakalapalli SI Madhu Prasad) శుక్రవారం తెలిపారు. కొత్త గంగారం గ్రామానికి చెందిన గీగ జ్యోతి,వసంతరావు దంపతులకు ఇద్దరు సంతానం.ఒక కుమారుడు అజయ్ (18 సంవత్సరాలు), ఒక కుమార్తె అనూష(16 సంవత్సరాలు).
అనూష ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తేదీ 10-11-2026న ఉదయం సుమారు 08:00 గంటలకు ఎప్పటిలాగే తన స్నేహితులతో కలిసి RTC బస్సులో కళాశాలకు వెళ్లింది.కళాశాల ముగిసిన అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా,జగన్నాధపురం గ్రామం వద్ద బస్సు దిగినట్లు ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే, ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జగన్నాధపురం,పరిసర గ్రామాలలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ విషయం పై బాలిక తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.