కక్కర్వాడలో జోరుగా వ్యవసాయ పొలాల బాట పనులు..

13-11-2026 | 10:14pm

ఝరాసంగం నవంబర్ 13: విబిజి రాంజీ పథకంలో(VBG Ramji Scheme) భాగంగా ఝరాసంగం మండలం కాకర్ వాడా గ్రామంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లే మట్టి రోడ్డు పనులు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ (FA) శశికుమార్, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ శశికుమార్ మాట్లాడుతూ, వర్షాకాలంలో మరియు పంటల కోత సమయంలో రైతులు తమ పొలాలకు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, కూలీలకు కూడా స్థానికంగానే ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు