క్రీడల నిర్వహణ కోసం స్టేడియం ఏర్పాటుకు కృషి

13-11-2026 | 10:08pm

ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు

కాగజ్ నగర్ నవంబర్ 13 ( విజయక్రాంతి): క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, క్రీడలను నిర్వహించేందుకు స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(MLA Harish Babu) తెలిపారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రీడమైదానంలో రాష్ట్రస్థాయి అండర్ 17  కరాటే పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరితో కలిసి ప్రారంభించారు.

క్రీడాకారులకు గెలుపోటములు ముఖ్యం కాదని క్రీడా స్ఫూర్తితో ఆటలో రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా  ఉందని , ఇందుకోసం కేంద్రం వాటా కింద 60 శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. మరో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేందుకు ఒప్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇప్పటివరకు క్రీడల నిర్వహణకు  సిర్పూర్ నియోజకవర్గం లో ఎలాంటి స్టేడియం, ఆడిటోరియంలు లేవని, దీంతో ఎస్ పి ఎం క్రీడ మైదానంపై ఆధారపడాల్సిన  దుస్థితి ఏర్పడిందని  పేర్కొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలో ఇప్పటికే బాక్సింగ్, కరాటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వీరినీ ప్రోత్సహించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే హరీష్ బాబు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇందిర, కన్వీనర్ ఈశ్వర్, పిడి మధుసూదన్, వివిధ జిల్లాల నుంచి  నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు