జాతీయ సైన్స్ కాంగ్రెస్కు బాలికల ఎంపిక
వ్యవసాయ విభాగం – “పంట రక్షణ”
సత్తుపల్లి నవంబర్13( విజయక్రాంతి ) : పట్టణంలోని బాలికల పాఠశాలకు(Girls' school) చెందిన విద్యార్థినులు(Female students) జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో(National Children's Science Congress Competition) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం ఖమ్మం సైన్స్ మ్యూజియంలో(Khammam Science Museum) నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో వ్యవసాయ విభాగానికి సంబంధించిన “పంట రక్షణ” అనే అంశంపై తమ ప్రాజెక్టును సమర్థవంతంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు.
ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు కె ధన భర్ష 10వ తరగతి టి. ఉమా శ్రీ ఈ విద్యార్థినులకు మార్గదర్శకురాలిగా పాఠశాల ఉపాధ్యాయురాలు కే చిట్టి కుమారి వ్యవహరించారు. విద్యార్థినుల ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినులను, గైడ్ టీచర్ను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.j