బయో మైనింగ్ ప్రక్రియను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

13-11-2026 | 10:09pm

తూప్రాన్, నవంబర్ 13, (విజయక్రాంతి): మున్సిపల్ బ్రాహ్మణపల్లి(Municipal Brahmanapalli) సమీపంలోని డంపింగ్ యార్డును(Dumping yard) శుక్రవారం మున్సిపల్ చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ సందర్శించారు. ఈ క్రమంలో డంపింగ్ యార్డులో పేరుకు పోయిన చెత్త వ్యర్థాలను బయోమైనింగ్ పద్ధతిలో వేరుచేసే ప్రక్రియ ప్రారంభించారు. డంపింగ్ యార్డులో చెత్త వేరుచేసే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా యార్డు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు.

మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తూప్రాన్ ప్రజలను ఉద్దేశించి ఇకపైన తూప్రాన్ పట్టణవాసులు ఇంటి వద్దనే తడి-పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటి నుంచి చెత్త వేరు చేయడం ప్రారంభమైనప్పుడే మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యం అని ప్రజల సహకారంతో స్వచ్ఛ తూప్రాన్–పరి శుభ్రమైన లక్ష్యాన్ని సాధించవచ్చని వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు