ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా అలవాల శ్రీనివాస్‌

14-10-2026 | 08:45pm

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండల ఫొటోగ్రాఫర్స్‌(Photographers) కమిటీ ఎన్నికల్లో అలవాల శ్రీనివాస్‌ ప్యానెల్‌ విజయం సాధించింది. బుధవారం మండల కేంద్రంలోని సేవాలాల్‌ టెంపుల్‌ వద్ద జిల్లా ఫొటోగ్రాఫర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా అలవాల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడిగా యాసం రమేష్‌, కోశాధికారిగా రవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఫొటోగ్రాఫర్స్‌ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ నూతన కమిటీ ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు