కోడి పందాలు, పేకాటపై కఠిన చర్యలు

16-11-2026 | 12:04pm

మైనర్లకు వాహనాలు ఇవ్వదు: సీఐ నాగరాజు

అశ్వారావుపేట,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో జూదం(Gambling), కోడి పందాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు(Ashwaraopet Circle Inspector Nagaraju) ప్రజలను హెచ్చరించారు. జిల్లా ఎస్పి ఆదేశాలు మేరకు సోమవారం మండలంలోని వడ్డే రంగాపురం గ్రామం(Vadde Rangapuram Village)లో కార్డాన్ సెర్చ్ చేపట్టారు. గ్రామం లోనీ  అన్ని ఇళ్ళల్లో సోదాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు  చలనాలు విధించి, వసూలు చేసినట్టు తెలిపారు.

పూర్తిగా  ధృవ పత్రాలు  లేని 5 ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు సి ఐ తెలిపారు.  ఈ సందర్భంగా సి ఐ మాట్లాడుతూ గంజాయి విక్రయాలు చేసిన, సేవించిన  చర్యలు తప్పవన్నారు. సైబర్ నేరాలు జరగకుండా  తీసుకోవలసిన  జాగ్రత్త లు గురించి తెలియజేశారు. మైనర్లకు డ్రైవింగ్  చేయకుండా తల్లితండ్రులకు కౌన్స్ లింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి, అదనపు ఎస్ ఐ దేవ్ సింగ్, దమ్మపేట అదనపు ఎస్ ఐ బాలస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు