ఆంగ్ల వక్తృత్వ పోటీల్లో భూక్య మహతికి ద్వితీయ బహుమతి

21-11-2026 | 08:05pm

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక –  గ్రామస్తుల హర్షం

సింగరేణి / నవంబర్ 21 విజయక్రాంతి: సింగరేణి మండలం(Singareni Mandal) ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల(Ekalavya Model Residential School) టేకులపల్లి లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని భూక్య మహతి వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించింది.

దుమ్ముగూడెం(Dummugudem) ఈఎంఆర్ఎస్  పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా మూడు క్లస్టర్లుగా విభజించి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఇందులో క్లస్టర్-2 స్థాయిలో భూక్య మహతి తన ఆంగ్ల వక్తృత్వ ప్రతిభను చాటుకుని ద్వితీయ బహుమతి సాధించడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.

ఈ సందర్భంగా విద్యార్థిని భూక్య మహతిని ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. విద్యార్థినిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపల్ నిషాన్ కిష్ణావ్‌కు, విద్యార్థుల బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయురాలు పారుల్ కథారియాకు మహతి తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

చిన్న వయస్సులోనే వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చాటుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భూక్య మహతి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు