గిరిజన హక్కుల కోసం పోరాడిన నేత భగవాన్ బిర్సా ముండా

18-11-2026 | 07:29pm

గిరిజన మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నునావత్ బిక్కు నాథ్ నాయక్.

ములకలపల్లి,నవంబర్ 18 (విజయక్రాంతి): భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో(History of the Indian Freedom Struggle) గిరిజనుల వీరత్వానికి, ఆత్మగౌరవానికి(Self-esteem), పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా(Bhagwan Birsa Munda) 151వ జయంతి సందర్భంగా జన్ జాతీయ గౌరవ్ దివాస్ ఉత్సవాలను బీజేపీ పార్టీ(BJP Party) ఆధ్వర్యంలో అశ్వారావుపేట నియోజకవర్గం(Ashwaraopeta Constituency) ములకలపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఘనంగా నిర్వహించడం  జరిగింది. ఈ సందర్భంగా వారు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  బీజేపీ జాతీయ గిరిజన మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నునావత్ బిక్కునాథ్ నాయక్ మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా  151 వ జయంతిని మోడీ ప్రభుత్వం జన్ జాతీయ గౌరవ్ దివాస్ గా ప్రకటించడం  గొప్ప ఆలోచన అని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సముండా జీవిత చరిత్ర,బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం,గిరిజన సమాజ హక్కుల కోసం చేసిన త్యాగాలు, ఆయన చూపిన ధైర్యసాహసాలు  పోరాట పటిమ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని అన్నారు.బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిర్సా ముండా చరిత్ర మనందరికీ  స్ఫూర్తిదాయకం అని ,అదేవిధంగా 

భగవాన్ బిర్సా ముండా  కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు,గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక,అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడన్నారు.ఈ కార్యక్రమం అనంతరం ములకలపల్లి  మండలము మాదారం గ్రామపంచాయతీకి  చెందిన మొత్తం 40కుటుంబాలు జిల్లా కార్యవర్గ సభ్యులు ఊకంటి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. వారికి జిల్లా అధ్యక్షులు  బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కండవు కప్పి పార్టీలోకి స్వాగతం చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు భూక్య స్వాతి, మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అనముల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఊకంటి మధుసూదన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి పూనెం నవీన్ కుమార్, అత్యం సాయి, భానోత్ మల్లేష్ గిరిజన మోర్చ మండల అధ్యక్షులు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు గొడ్ల రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిని డాక్టర్ జాటోత్ వెంకన్న, బోగి కృష్ణయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టి పుల్ల దుర్గా శ్రీనివాసరావు, స్టేట్ గిరిజన మోర్చా సభ్యులు తంబల రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉడతనేని విశ్వేశ్వరరావు,ఎస్సీ మోర్చా నాయకులు పాలకుర్తి శ్రీను అశ్వారావుపేట మండల అధ్యక్షులు మెట్ట వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పుష్కర్, ఎస్విటి కొండయ్య, అచ్చన రంగారావు, తోటా వెంకటేశ్వర్లు, ఎర్రం శెట్టి శ్రీను, చల్లా తిరుమలేశు, కుంజ సీతారాం బాబు, సాయిల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు