రాజ్‌తో కలిసి సమంత ప్రత్యేక పూజలు

18-11-2026 | 07:51pm

హైదరాబాద్: టాలీవుడ్ నటి సమంత(Samantha), దర్శకుడు రాజ్‌(Director Raj)కు సంబంధించిన ప్రత్యేక వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకర్షిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంట్లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో సమంత, రాజ్ కలిసి పాల్గొని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సమంత ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోగా, రాజ్ క్రీమ్ కలర్ కుర్తాలో కనిపించారు. పూజా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అందమైన క్షణాలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు