బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు

15-11-2026 | 08:54am

గుండాల,(విజయక్రాంతి): నేటి బాలలే రేపటి భారత దేశ భవిష్యత్తని ప్రగతి విద్యాలయం కరస్పాండెంట్ తాటిపల్లి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం వారి పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నవ్వుల్లోనే దేశ ప్రగతి దాగి ఉందని, బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, సంక్షేమంపై సమాజంలో అవగాహన కల్పించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని(Children's Day celebrations) జరుపుకుంటామని అన్నారు.

భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటామని ఆయన చిన్నారులకు వివరించారు. అనంతరం చిన్నారులు ఉపాధ్యాయులుగా తమ తోటి విద్యార్థులకు ఆసక్తిగా పాఠాలను బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గణేష్, ఉపాధ్యాయులు వెంకన్న, శోభా, రమ్య, మౌనిక, శిరీష, శ్రావణి, శకుంతల, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు