ఎస్టీ హాస్టల్ లో విద్యార్థిని అదృశ్యం
15-11-2026 | 07:21am
సిర్గాపూర్(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ ట్రైబల్ హాస్టల్లో(ST Tribal Hostel)10వ తరగతి చదువుతున్న కల్హేర్ మండలం ఖానాపూర్ తాండకు చెందిన విద్యార్థిని శనివారం బాలల దినోత్సవం తోటి విద్యార్థులతో జరుపుకొని మధ్యాహ్నం 2 గంటల నుండి కనిపించకుండపోయందని ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎంత వెతికిన ఆచూకీ కనిపించకపోవడంతో కలకలం రేగింది. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బందిలో ఆందోళన నెలకొంది. విద్యార్థిని ఆచూకీ కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అదృశ్యానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంక తెలియాల్సి ఉంది.