అంబరాన్నంటిన తారే జమీన్ పర్

15-11-2026 | 05:15am

3 వేల మంది దివ్యాంగ చిన్నారుల సందడి

సికింద్రాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ ఇండియా(Round Table India) ఏరియా 9 ఆధ్వర్యంలో ‘తారే జమీన్ పర్’(Tare Zameen Par) వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం లో మూడు వేల మందికి పైగా దివ్యాంగ చిన్నారులు పాల్గొన్నారు. పెయింటింగ్ పోటీ లు, నృత్యాలు, సంగీతం, మ్యాజిక్ షో తదితర కార్యక్రమాలు చిన్నారులను అలరిం చాయి.

ఈ వేడుకకు ప్రముఖ సినీనటుడు సాయి దుర్గ తేజ్, నటి ఈషా రెబ్బా, సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, నటి అషురెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ ఇండియా  ఏరి యా 9 ఛైర్మన్ అనిరుధ్ సోంపల్లి మాట్లాడుతూ.. ప్రతి చిన్నారిలోనూ ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, వారికి అవకాశాలు కల్పించడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని తెలిపా రు. మూడు వేల మందికి పైగా చిన్నారుల చిరునవ్వులే ఈ కార్యక్రమానికి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు.

పెయింటింగ్ పోటీల కు న్యాయనిర్ణేతలుగా మందాకిని రావు, తులసి నాయక్ వ్యవహరించారు. కొరియోగ్రాఫర్లు స్నేహ నహర్, ధ్వని షా మెహతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల నిర్వహణలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 ఛైర్మన్ అనిరుధ్ సోంపల్లి, తారే జమీన్ పర్ కన్వీనర్ సిద్ధార్థ్ సీహెచ్, ఈవెం ట్ మెంటార్ దర్శీల్ షా, ఆర్టీఐ వీక్ కన్వీనర్ లోకేశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 

మరిన్ని వార్తలు