వసూళ్లలో ఆల్‌టైమ్ రికార్డ్

15-11-2026 | 08:01am

ఒక్క నెలలో రూ.6,640 కోట్లు!

క్యాష్‌కు గుడ్‌బై.. FASTag, UPIతో టోల్ వసూళ్ల దూకుడు!

న్యూఢిల్లీ: దేశంలోని National Highways, Expresswaysపై వాహనాల రాకపోకలు పెరుగుతుండటంతో టోల్ ఆదాయం సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఏకంగా రూ.6,640 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పటివరకు నమోదైన నెలవారీ వసూళ్లన్నింటినీ అధిగమించి సరికొత్త All-Time Recordను నమోదు చేసింది. దేశంలో పెరుగుతున్న Economic Activity, వాహనాల రాకపోకలు అధికం కావడం ఈ ఆదాయ వృద్ధికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

గత రికార్డులన్నీ బద్దలు.. భారీగా పెరిగిన ఆదాయం!

గత ఏడాది అక్టోబర్‌లో రూ.5,715 కోట్లుగా ఉన్న టోల్ వసూళ్లు ఈసారి దాదాపు 16 శాతం పెరిగి రూ.6,640 కోట్లకు చేరాయి. అంతేకాదు.. ఈ ఏడాది మే నెలలో నమోదైన రూ.6,185 కోట్ల రికార్డును కూడా తాజా వసూళ్లు అధిగమించాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా Toll Collection రూ.74,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

క్యాష్‌కు కాలం చెల్లింది.. UPI, FASTag హవా!

టోల్ వసూళ్లలో ఆదాయం పెరగడమే కాకుండా Payment Systemలోనూ భారీ మార్పులు వచ్చాయి. గత ఏడాది అక్టోబర్‌లో రూ.84 కోట్లుగా ఉన్న నగదు చెల్లింపులు ఈసారి కేవలం రూ.4 కోట్లకు పడిపోయాయి. మరోవైపు Digital Payments వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా Unified Payments Interface (UPI) ద్వారా చెల్లింపులు దాదాపు రూ.100 కోట్లకు చేరడం విశేషం. FASTag వినియోగం కూడా టోల్ వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తోంది.

టోల్ ప్లాజాల వద్ద ఇక డిజిటల్ పేమెంట్స్‌కే ప్రాధాన్యం!

టోల్ ప్లాజాల వద్ద FASTag, UPI Paymentsకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో Cash Transactions దాదాపుగా కనుమరుగవుతున్నాయి. ఈ Digital Payment విధానం వల్ల లావాదేవీల్లో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు అవకాశం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే టోల్ గేట్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గి ప్రయాణం సులభతరమవుతోంది. మరోవైపు వాహనదారులు కూడా ఎక్కువగా Annual FASTag Passలను ఎంచుకుంటున్నారు. మొత్తంగా దేశ రహదారులపై పెరుగుతున్న వాహనాల రద్దీతో పాటు డిజిటల్ చెల్లింపుల విస్తరణ టోల్ ఆదాయానికి కొత్త ఊపునిస్తోంది.

మరిన్ని వార్తలు