ఇందిరమ్మ బీమా పథకంపై కాంగ్రెస్ ప్రచారం

19-11-2026 | 04:56pm

అశ్వాపురం, నవంబర్ 19 (విజయక్రాంతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Former Prime Minister Indira Gandhi) జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ చేపట్టారు.

మండలంలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, నాయకులకు గ్రామాల వారీగా కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి ఉచితంగా బీమా రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తోందని తెలిపారు. లబ్ధిదారులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా అమలు చేయనున్న.

ఈ పథకం ప్రయోజనాలను ఇంటింటికీ చేరవేసి ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, వేములపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు