ఔట్సోర్సింగ్ కార్మికుల ఆందోళన

19-11-2026 | 04:03pm
  1. కుంటి సాకులు చూపి 11 మందికి షోకాజ్ నోటీసులు. 
  2. ఉద్యోగ భద్రత కొరకు కళాశాల ఎదుట ధర్నా. 

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో(Government Nursing College) 32 మంది ఔట్సోర్సింగ్ కార్మికుల్లో(Outsourced workers) 11 మందికి షోకాజ్ నోటీసులు జారీ కావడంతో ఆందోళన నెలకొంది. ప్రిన్సిపాల్ కార్మికుల పట్ల బానిసల మాదిరి వేధింపులకు గురిచేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తూ ప్రజాసంఘాల నాయకులతో కలిసి కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. నోటీసులపై నిష్పక్షపాత విచారణ జరిపి ఉద్యోగ భద్రత కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.

మరిన్ని వార్తలు