ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19-11-2026 | 04:41pm

అశ్వాపురం, నవంబర్ 19 (విజయక్రాంతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Former Prime Minister Indira Gandhi) 109వ జయంతి వేడుకలను గురువారం అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(Congress Party Office) ఓరుగంటి వీరయ్య భవన్‌లో మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ.. 'గరీబీ హటావో' నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయ సాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు పేదల అభ్యున్నతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఓరుగంటి బిక్ష్మయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, కందాల వెంకటరెడ్డి, వేములపల్లి రమేష్, ఏఎంసీ డైరెక్టర్లు తెల్లం వీరభద్రం, సోడే వెంకటేశ్వర్లు, సర్పంచ్ మచ్చా నరసింహారావు, కొండాబత్తుల ఉపేందర్, తూము వీరాఘవులు, ఆవుల రవి, సామకూరి వెంకన్న, లంకమల్ల కొండలరావు, బచ్చు వెంకటరమణ, జిన్నక నాగయ్య, సురకంటి గంగారెడ్డి, మానాది వెంకన్న, తెల్లం నాగరాజు, తెల్లం వెంకటేశ్వర్లు, భూతం వెంకన్న, గొల్లపల్లి నరేష్, వేముల విజయ్, కోలా శశికాంత్, కంటెం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు