జాతీయ స్థాయి ఖో -ఖో పోటీలకు భీమవరం విద్యార్థి

19-11-2026 | 04:10pm

ఎర్రుపాలెం నవంబర్ 19 (విజయ క్రాంతి): ఈ నెల 21వ తేదీ నుండి 26 తేదీ వరకు గుజరాత్ లో జరిగే జాతీయ స్థాయి ఖో - ఖో పోటీలలో (National-level Kho-Kho competition) ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వేమిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమవరం 10 వ తరగతి విద్యార్థిని శీలం తేజశ్రీ  పాల్గొంటున్నదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ ఉపేందర్  పి డి నరాల సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

గత 25 రోజులుగా సరూర్ నగర్ స్టేడియం మరియు మక్తల్ స్టేడియం లో జరిగిన జాతీయ స్థాయి ఖో - ఖో క్యాంప్ లో శిక్షణ పొంది తెలంగాణ రాష్ట్రం తరుపున ఆడనున్నది జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభను కనబర్చి తెలంగాణ రాష్ట్రం కు మంచి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ వంగల నాగేశ్వరరావు  ఏఏపిసి చైర్మన్ తులిసమ్మ  వైస్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాసరెడ్డి  పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు తేజశ్రీ నీ అభినందించారు.

మరిన్ని వార్తలు