వెల్గటూర్ పీఏసీఎస్ లావాదేవీలపై విచారణకు డిమాండ్

19-11-2026 | 04:48pm

ధర్మపురి,నవంబర్19 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో జరిగిన వివిధ లావాదేవీలు, జమా–ఖర్చుల వివరాలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గండ్ర శ్రీకాంత్ రావు(Congress Secretary Gandra Srikanth Rao) కోరారు. ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారంలో సంఘ భవన నిర్మాణం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, గన్నీ సంచులు, నిర్వహణ ఖర్చులకు సంబంధించిన పలు అంశాలు ఉన్నాయని తెలిపారు.

సంఘ భవన నిర్మాణానికి సుమారు రూ.కోటి, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు గత ఐదేళ్లలో సుమారు రూ.85 లక్షల వరకు ఖర్చులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఖర్చులకు సంబంధించిన రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.రైతుల ప్రయోజనాల కోసం పనిచేసే సహకార సంఘంలో ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలని, జిల్లా అధికారులు స్పందించి పీఏసీఎస్‌ లావాదేవీలపై సమగ్ర పరిశీలన చేపట్టాలని గండ్ర శ్రీకాంత్ రావు కోరారు.

మరిన్ని వార్తలు