గుట్టగూడెంలో అమరవీరుల వర్ధంతి సభలు
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం(Mulakalapalli Mandal)లోని గుట్టగూడెం గ్రామంలో అమరవీరులు వంకా వీరస్వామి, దుబ్బ బోడప్ప వర్ధంతి సభలు వంకా సురేష్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ(CPI ML New Democracy) కొత్తగూడెం జిల్లా నాయకులు ఎస్ కే ఉమర్ మాట్లాడుతూ అమరవీరుల ఆశయసాధన కోసం పనిచేయాలని ఈ గ్రామములో పోడు సాగుదారుల భూముల రక్షణ కోసం హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేసి వందలాది ఎకరాల పోడు భూములు ప్రజలకి ఆదివాసీలకు దక్కే విధంగా ఉద్యమించారు.
ఆదివాసీలు పోరాటాలు చేస్తున్న క్రమంలో వారికి అండగా ఉండి వందల ఎకరాల భూములను సాధించుకోవడంలో బోడప్ప వీరస్వామిల శ్రమ ఉందని నిరంతరం వారు పార్టీ కోసం ప్రజల కోసం పనిచేశారని ఈ ప్రాంతంలో భూ పోరాటంలో పాల్గొన్నారని వారి ఆశయ సాధన కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వారికోసం ప్రజలు పనిచేయాలని పిలుపునిచ్చారు.కమలాపురం గ్రామంలో బత్తుల నాగరాజు అధ్యక్షతన చలమన్న సరస్వతి ల సభలు జరిగాయి.
అమరవీరుల ఆశయాల కోసం ముందుకు సాగాలని నిత్యం ప్రజల పక్షాన పోరాడే అన్నలు ఎంతోమంది చంద్ర పుల్లారెడ్డి పొట్ల రామ నరసయ్య నీలం రామచంద్రయ్య ఈ ప్రాంతంలో చలమన్న సోయం గంగులు ఇలాంటి అందరూ భూమి కోసం భుక్తి కోసం వారి హక్కుల కోసం ఆదివాసుల రక్షణ కోసం పనిచేసి అమరులయ్యారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సవళ్ల ఆదినారాయణ, భాస్కర్,రమేష్ రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు మడి చంద్రం,కొర్రి లక్ష్మి,పెద్దమ్మ,లక్ష్మి,నాగరాజు లక్ష్మి, రమణ తదితరులు పాల్గొన్నారు.