రాజమల్లుకు డాక్టరేట్
"న్యాయ సేవా రత్న" అవార్డు
కొత్తగూడెం నవంబర్ 29 (విజయక్రాంతి): అమెరికన్ యూనివర్సిటీ గ్లోబల్ లీడర్స్ , విజనరీస్ కాంక్లేవ్ - 2026 తరఫున 126 ప్రముఖులకు ఆదివారం, తిరుపతిలోని హోటల్ రెగాలియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫౌండర్ , డైరెక్టర్ డా: కె. వెంకటేష్ వివిధ రకాల సామాజిక సేవలు చేసిన పలువురు ప్రముఖులకు అవార్డులు ప్రధానం చేశారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మెండు రాజమల్లు(Mendu Rajamallu)కు " డాక్టరేట్- న్యాయ సేవారత్న" అవార్డు అందుకున్నారు.
కొత్తగూడెం కోర్టులలో న్యాయవాదిగా లీగల్ సర్వీసెస్ మెంబర్ గా పలు హోదాలలో పనిచేశారని, న్యాయ సేవలు అందించారని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేశారు. యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియా, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అన్నదానం పంపిణీ చేశారు.
పాల్వంచ పట్టణంలోని నివాశ్రయులైన వారికి దుప్పట్లు, ఆహార పదార్థాలను నేతాజీ యువజన సంఘం, పాల్వంచ ఆధ్వర్యంలో పంపిణీ చేశారని గుర్తు చేశారు మెండు రాజమల్లు చేసిన సేవలకు ,గుర్తింపుగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందని తెలిపారు. అవార్డుల ప్రధానం రోజునననే మెండు రాజమల్లు దంపతులకు 41వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్, రవి,డా : వనజాక్షి, కార్డియాలజీ సర్జన్, హెచ్ ఓ డి,, ఎస్.వి.యూనివర్సిటీ చక్రధర సిద్ధాంతి, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్, ప్రముఖులు పాల్గొన్నారు.