తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్ష దివాస్ కు ప్రత్యేక స్థానం

29-11-2026 | 06:21pm

కెసిఆర్ అమర అమ రణ దీక్ష తెలంగాణ సాధనకు కీలక మలుపు 

యువత ఉద్యమ చరిత్ర ను తెలుసుకోవాలి 

కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో(Telangana Movement) దీక్ష దివాస్ కు ప్రత్యేక స్థానం ఉందని బిఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దిన్(BRS Kamareddy District President MK Mujeebuddin) అన్నారు. ఆదివారం కామారెడ్డి ఈఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కెసిఆర్(KCR) ఆమరణ దీక్ష తెలంగాణ సాధనకు కీలక మలుపు తిరిగిందన్నారు. యువత ఉద్యమ చరిత్రను తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఉద్యమ జేఏసీ నాయకులను ఈ సందర్భంగా సన్మానించారు.

కామారెడ్డి ,ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గ కేంద్రాల్లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు.

నిజామాబాదులో బీగాల గణేష్ గుప్తా, బోధనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఆర్మూర్లో, బాల్కొండలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి లో పాల్గొని మాట్లాడారు. దీక్ష దివాస్ లో కెసిఆర్ సచ్చు డో తెలంగాణ వచ్చు డో అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దీక్షకు పూనుకున్నారన్నారు. ఆసుపత్రిలో కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని వారు అన్నారు. యువతకు గత తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని ఈ సందర్భంగా సన్మానించి అభినందించారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామని ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని  కోరారు.

మరిన్ని వార్తలు