దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు..

29-11-2026 | 06:25pm

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ భారీగా తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు..

కోనరావుపేట, నవంబర్ 29 (విజయక్రాంతి): కరీంనగర్‌లో నిర్వహించిన దీక్షా దివస్(Deeksha Divas) కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలారు. మండల కేంద్రం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సుల్లో ఉత్సాహంగా బయలుదేరి కరీంనగర్‌కు తరలి వెళ్లారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన చారిత్రాత్మక ఉద్యమంలో దీక్షా దివస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు.

ఆనాటి ఉద్యమ పోరాటం, నాయకుల త్యాగాలు, ప్రజల భాగస్వామ్యం తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరువలేనివని అన్నారు.దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పేందుకు, పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటాన్ని స్మరించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే సంకల్పంతో కోనరావుపేట మండల కేంద్రం నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు మందాల శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు రాస రత్నాకర్ రెడ్డి నాయకులు యాస రాజం  మందాల బాలయ్య  బత్తుల దీపక్ రాజయ్య రత్నం శ్రీనివాస్ లింబయ్య లక్ష్మీరాజ్యం అంజయ్య చంద్రయ్య తదితరులు తరలి వెళ్లారు.

మరిన్ని వార్తలు