దీక్ష దీవాస్.. ఓ చరిత్రాత్మకం

29-11-2026 | 06:28pm
  1. - రాష్ట్రం కోసం కేసీఆర్ పోరాటం మరువలేనిది
  2. - మణుగూరు పట్టణం గూలాబిమయం
  3. - రానున్న ఎన్నికల్లో.... బిఅర్ఎస్ విజయం
  4. - జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా

మణుగూరు, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం కోసం నవంబర్‌ 29న జరిగిన దీక్ష దివాస్ కార్యక్రమం ఓ చరిత్రాత్మకం అని జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Former MLA Rega Kantarao) అన్నారు. ఆదివారం మణుగూరు మండలంలోని గుట్ట మల్లారంలో జరిగిన దీక్ష దివాస్ సభకు భారి ఎత్తున బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గం నుండి భారిగా తరలి వచ్చారు. ఏరియా అసుపత్రి నుండి సురక్ష బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం సభ ప్రాంగాణానికి చేరుకున్న కార్యకర్తలు నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ,,, 14 ఏళ్ల తెలంగాణ  ఉద్యమం లో ఈ రోజుకి ప్రత్యేకత ఉంది.. తెలంగాణ రాదేమో అనే పరిస్థితులో చివర ప్రయత్నం గా ఆమరణ నిరాహార దీక్షా చేపట్టిన కేసీఆర్.. తెలంగాణ వచ్చుడా.. కేసీఆర్ చచ్చుడా అనే నినాదం తో కేసీఆర్ త్యాగం తెలంగాణ ప్రజలు మరువలేనిదని, ఎందరో విద్యార్థుల బలిదానాలు చేసిన స్పందన లేని కేంద్రము.. కేసీఆర్ నిరాహారదీక్షతో దిగివచ్చింది.తెలంగాణా ఇచ్చినట్లే ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఖమ్మంలో కారాగారంలో కేసీఆర్ ని ఉంచారు..కానీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ గోస పడుతుందని, మరో ఉద్యమం ఈ దీక్షా దివస్ తో మొదలవుతుందని అన్నారు.. 

ఎందరో ప్రాణాల త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణకు శ్రీ రామరక్ష కేసీఆర్ అని గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్టం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం  అధికారం రావాలని మన గర్జనతో హైదరాబాద్ లో రేవంత్ కి ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకుకు వణుకు పుట్టాలని  అయన అన్నారు.. రాబోయే ప్రభుత్వం మనదే అని ప్రతి కార్యకర్త ఓపిక గా ఉండాలని రేగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు