భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడిపూజ
రాజాపూర్ నవంబర్ 29 : రాజాపూర్ మండలంలోని(Rajapur Mandal) మల్లేపల్లి గ్రామంలో డీలర్ చెన్నారెడ్డి(Dealer Chennareddy) స్వగృహంలో ఆదివారం బాబు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి 18వ నారికేళ మహా పడిపూజ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో గ్రామం మారుమూవింది ఈ వేడుకలకు వివిధ గ్రామాల అయ్యప్ప స్వామి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి(Former Minister Dr. C Laxma Reddy) బీఆర్ఎస్ పార్టీ నాయకులు(BRS party leaders) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ జెడ్పిటిసి మోహన్ నాయక్,మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, అడ్వకేట్ యాదిరెడ్డి, ఆనంద్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.