గృహప్రవేశ వేడుకలో డిప్యూటీ మేయర్ ఎంఎస్ఆర్
29-11-2026 | 06:24pm
మహబూబ్నగర్ (విజయక్రాంతి): నగరంలోని 11వ డివిజన్ బంధమిదిపల్లిలో(Bandhamidipalli) శేఖర్అనిత దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుక(Housewarming Ceremony) ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి(Municipal Corporation Deputy Mayor Marepalli Surender Reddy) (ఎంఎస్ఆర్) హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.