ఎస్పీని కలిసిన ప్రజాసంఘాల నాయకులు

27-11-2026 | 06:15pm

ఆసిఫాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి):జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (Telangana Adivasi Tribal Association) నాలుగో రాష్ట్ర మహాసభలకు హాజరుకావాలని కోరుతూ శుక్రవారం జిల్లా ఎస్పీ నీతిక పంత్‌ను ప్రజాసంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. మహాసభలకు జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరుకానున్నట్లు వివరించారు.

సభలను శాంతియుత వాతావరణంలో నిర్వహించి పోలీసులకు సహకరిస్తామని తెలిపారు. మహాసభలకు సహకరిస్తామని ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన వారిలో రాష్ట్ర నాయకులు బండారి రవికుమార్, భూపాల్, జిల్లా నాయకులు కూశాన రాజన్న, దుర్గం దినకర్, నేర్పల్లి అశోక్ ఉన్నారు.

మరిన్ని వార్తలు