ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం
ఖానాపూర్ ( విజయక్రాంతి): క్రిస్మస్ వేడుకలు(Christmas celebrations) -2026 సందర్భంగా రాష్ట్రంలోని అర్హత కలిగి, నమోదిత చర్చిలకు తెలంగాణ ప్రభుత్వం రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అల్పసంఖ్యాకుల సంక్షేమ అధికారి టి. దయానంద్ తెలిపారు. చర్చిలకు వైట్‌వాష్ కోసం రూ.20 వేలు, విద్యుత్ దీపాలంకరణ కోసం రూ.10 వేలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
అర్హత కలిగిన చర్చి కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు ఈ నెల 30వ తేదీలోగా https:// tgobmms.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రింట్అవుట్తో పాటు చర్చి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కమిటీ వివరాలు,
బ్యాంకు ఖాతా పత్రాలు, జియో ట్యాగ్ కలర్ ఫొటోలు తదితర ఆధారాలను డిసెంబర్ 1వ తేదీలోగా నిర్మల్ ఐడీఓసీ నూతన కలెక్టరేట్లోని గది నంబర్ ఎఫ్3లో ఉన్న జిల్లా అల్పసంఖ్యాకుల సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. చర్చి పేరుతో బ్యాంకు ఖాతా లేనిపక్షంలో అధ్యక్షుడు, కార్యదర్శి లేదా కోశాధికారితో కూడిన జాయింట్ ఖాతా వివరాలు సమర్పించాలని సూచించారు.