కార్మికుల హక్కులు కాలరాస్తే ఊరుకోము

27-11-2026 | 06:23pm

 సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి 

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(Centre of Indian Trade Unions) (సిఐటియు) జిల్లా వర్క్ షాప్ స్తానిక తాపీ సంఘ భవనంలో గోమాస ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు(CITU) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  జయలక్ష్మి  మాట్లాడుతూ.... భారతదేశ కార్మికవర్గం గడిచిన శతాబ్ది కాలంలో అనేక పోరాటాలు, త్యాగాలు(Struggles and sacrifices) చేసి కార్మిక చట్టాలను(Labour laws) సాధించుకున్నదనీ తెలిపారు.. పెట్టుబడిదారుల ప్రయోజనాల(Investors' interests) కోసమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం(BJP-led central government) 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను(Labour Codes) తీసుకొచ్చిందనీ మండిపడ్డారు.

వాటి అమలుకు అవసరమైన రూల్స్న ఆమోదింపచేసుకుందనీ విమర్శించారు.. దేశ కార్మికవర్గం హక్కులు హరించి, కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడాలని పాలకులు చూస్తున్నారన్నారు. కార్మిక చట్టాలలో సంస్కరణల పేరుతో తెచ్చిన అనేక మార్పుల వల్ల కార్మికుల భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందినీ వాపోయారు. ప్రభుత్వరంగ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు సంస్కరణల పేరుతో సరళీకరణ విధానాలు చేపట్టారనీ తెలిపారు.. మన రాష్ట్రంలో సైతం సింగరేణి, విద్యుత్, ఆర్టిసిల వంటి వాటిని బలహీనం చేయడంతో పాటు, ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారునీ ఆరోపించారు..

అంగన్వాడీ, ఆశా, ఐకెపి విఓఏ, మధ్యాహ్న భోజన పథకం, ఆర్పి, సమగ్ర శిక్షణ, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ, 108, 104, అర్బన్ హెల్త్ తదితర రంగాలలో అనేక మంది స్కీం వర్కర్స్ గా పని చేస్తున్నారనీ తెలిపారు.. దశాబ్దాలు గడిచినా వీరిని కార్మికులుగా గుర్తించడం లేదున్నారు. పిఎఫ్, ఇఎస్ఐ, గ్రాట్యుటీ, కనీస వేతనం అమలు చేయడం లేదు,రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక హక్కులు రక్షణకై డిసెంబర్ 1,2,3 తేదీల్లో జరిగే ఛలో పార్లమెంటు కార్యక్రమానికి జిల్లాలోని అన్ని వర్గాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాజారెడ్డి ,అల్లి రాజేందర్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, పైళ్ల ఆశయ్య చేతి వృత్తుదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్, జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ , జిల్లా ఉపాధ్యక్షులు సమ్మక్క , జిల్లా సహాయక కార్యదర్శిలు దాగం రాజారాం, సాంబారి వెంకటస్వామి , జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాస్, సబిత , అంగన్వాడి జిల్లా కార్యదర్శి రాజమణి , మున్సిపల్ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్, అరుంధతి, మహేశ్వరీ, సత్యవతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు