ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డైరెక్టర్

27-11-2026 | 06:26pm

వాంకిడి, నవంబర్ 27 (విజయక్రాంతి):వాంకిడి మండలంలోని చౌపన్‌గూడ సాటిలైట్ ఆశ్రమ పాఠశాలను(Satellite Ashram School) గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, విద్యార్థుల హాజరు, పాఠశాల పరిసరాలు, విద్యాబోధనను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగ్గా ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు