సబ్స్టేషన్లో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి విద్యుత్ సబ్స్టేషన్(Mulakalapalli Electricity Substation) ప్రాంగణంలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (CGRF – Consumer Grievance Redressal Forum) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి CGRF చైర్మన్ అండ్ టెక్నికల్ మెంబర్ K.మాధవరావు అధ్యక్షత వహించారు. CGRF ఫైనాన్స్ మెంబర్ ఎస్. S.సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్వంచ మండలం, ములకలపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అధికారులకు వివరించారు.విద్యుత్ బిల్లులు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మీటర్ల సమస్యలు,వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదులను అధికారులకు సమర్పించారు. వినియోగదారుల నుంచి వచ్చిన మూడు (03) ఫిర్యాదులను అధికారులు స్వీకరించి,వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడంతో పాటు,వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో SE G.మహేందర్, DE J.బద్రు పవార్, SAO శ్రీధర్, ADE K.రాంప్రసాద్, AE బోయపాటి నరేష్, సబ్ ఇంజినీర్ CH.శ్రీను మండల సర్పంచులు, వినియోగదారులు, వద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.