ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో భారీ మావోయిస్టు డంప్‌ల గుర్తింపు

13-11-2026 | 07:33pm

భద్రతా బలగాలకు భారీ విజయం

చర్ల, (విజయ క్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు(Maoists) భారీ షాక్ ఇచ్చాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు భారీ ఆయుధ డంప్‌లను(Weapons dump) గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి.

ఏం స్వాధీనం చేసుకున్నారు?

1. పుజారికంకేర్ అడవుల్లో: ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుజారికంకేర్ గ్రామ సమీప అడవుల్లో గురువారం, శుక్రవారం జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో భూగర్భంలో దాచిన డంప్ బయటపడింది. దీనిలో 955 డిటోనేటర్లు (455 ఎలక్ట్రిక్, 500 నాన్-ఎలక్ట్రిక్) స్వాధీనం చేసుకున్నారు.

2. దీనితో పాటు 2 మల్టీమీటర్లు, రేడియో సెట్ బ్యాటరీ ఛార్జర్ క్రెడిల్స్, కాపర్ ప్రోటోటైపింగ్ బోర్డులు, యాంటెన్నాలు, రిలే కంట్రోల్ సర్క్యూట్ బోర్డులు, 8 మీటర్ల ఎలక్ట్రిక్ వైర్ మరియు మావోయిస్టు సాహిత్యం కూడా దొరికింది.

3. కర్రెగుట్ట కొండల్లో: దీనికి ఒకరోజు ముందే అదే జిల్లాలోని కేజీ హిల్స్ , తాడపాల ఎఫ్ఓబి  (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ) కు 1.5 కి.మీ దూరంలో 711 బిజిఎల్ (భార్రెలు గ్రేనాడే లాంచ్చర్ ) షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 03968683

ఆపరేషన్ ఎలా జరిగింది?

కోబ్రా 204వ బెటాలియన్ ఇంటెలిజెన్స్ వింగ్ ఇచ్చిన పక్కా సమాచారంతో, జిల్లా పోలీసులు, సిఆర్పిఎఫ్ , కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని అదనపు ఎస్పీ రాహుల్ బన్సల్ తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకే ఈ డంప్‌లను గుర్తించినట్టు తెలుస్తోంది. మార్చి 31న బస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించిన తర్వాత కూడా అడవుల్లో దాచిన ఆయుధాల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ భారీ పేలుడు పదార్థాల స్వాధీనంతో భవిష్యత్తులో జరగాల్సిన పెద్ద దాడులను భద్రతా బలగాలు భగ్నం చేసినట్టయింది.

మరిన్ని వార్తలు