లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

28-11-2026 | 04:41pm

అశ్వాపురం, నవంబర్ 28 (విజయక్రాంతి): మండలంలోని మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మర్రి సంధ్య ముఖ్య అతిథిగా (Chief Guest) హాజరై అర్హులైన లబ్ధిదారులకు తన చేతుల మీదుగా కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల (Welfare Schemes) ప్రయోజనాలు పొందేందుకు ఇవి కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలమల్ల శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, పాలకవర్గ సభ్యులు రామిడి శంభారెడ్డి, కొమరం రాము, జీపీఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు